Jagan: విశాఖలో శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు... సీఎం జగన్ కు ఆహ్వానం

Swatmanandendra invites CM Jagan to grace Visakha Sarada monastery anniversary
  • జనవరి 27 నుంచి శారదా పీఠం ఉత్సవాలు
  • తాడేపల్లి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి
  • సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందజేత
విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలంటూ ఆశ్రమ వర్గాలు సీఎం జగన్ ను ఆహ్వానించాయి. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నేడు తాడేపల్లి విచ్చేశారు. సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. సీఎంకు వేదాశీర్వచనం అందించారు. 

కాగా, శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఆశ్రమంలో యజ్ఞయాగాదులు నిర్వహించనున్నారు.
Jagan
Sarada Pitham
Anniversary
Swatmanandendra Saraswati
Visakhapatnam

More Telugu News