Allu Arjun: జీక్యూ 'లీడింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Allu Arjun receives GQ Leading Man Of India award
  • 'పుష్ప'తో భారీ విజయం సొంతం చేసుకున్న బన్నీ
  • పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్
  • బన్నీ మేనరిజమ్ కు అంతర్జాతీయ గుర్తింపు
  • అవార్డుకు ఎంపిక చేసిన జీక్యూ మ్యాగజైన్ 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ద్వారా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సృష్టించిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గడ్డం కింద చేయి పెట్టి 'తగ్గేదే లే' అనే మేనరిజమ్ ను అంతర్జాతీయ సెలబ్రిటీలు, క్రీడాకారులు సైతం అనుకరించారంటే బన్నీ ఏ రేంజిలో ఆకట్టుకున్నాడో అర్థమవుతుంది. 

ఈ నేపథ్యంలో బన్నీని ఓ విశిష్ట పురస్కారం వరించింది. జీక్యూ మ్యాగజైన్ ప్రతి ఏడాది అందించే జీక్యూ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు... 2022 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ కు దక్కింది. మెన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో బన్నీ అగ్రస్థానంలో నిలిచాడు. జీక్యూ లీడింగ్ మ్యాన్ అవార్డు గతంలో మరే తెలుగు నటుడికీ దక్కలేదు. హైదరాబాదులో నిర్వహించిన ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.  

దీనిపై అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు జీక్యూ ఇండియా సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫొటో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తన లక్ష్యాల జాబితాలో మరొకదాన్ని సాధించానని బన్నీ పేర్కొన్నాడు. 

కాగా, ఈ అవార్డును అందించేందుకు జీక్యూ టీమ్ హైదరాబాదుకే తరలిరావడం విశేషం. ఈ అవార్డు కార్యక్రమం అనంతరం తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News