Pure EV: ప్యూర్ ఈవీ నుంచి అతి త్వరలో ఎలక్ట్రిక్ మోటారు సైకిల్

  • జనవరిలో ఆవిష్కరణకు అవకాశం
  • ఒక్కసారి చార్జ్ తో 135 కిలోమీటర్ల ప్రయాణం
  • ఐసీఈ మోటారు సైకిల్ కు ఏ మాత్రం తీసిపోదంటున్న సంస్థ
Pure EV electric motorcycle has a range of 135 km range launch soon

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు వందకు పైనే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల పరంగా వినియోగదారులకు ఎక్కువ ఆప్షన్లు లేవు. రివోల్ట్ మోటారు సైకిల్ ఒక్కటే ఇప్పటి వరకు కాస్తంత మెరుగైన ఎంపికగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటీ స్టార్టప్ అయిన ప్యూర్ ఈవీ సంస్థ అతి త్వరలోనే ఒక మోటార్ సైకిల్ ను విడుదల చేయనుంది. 

ఈకో డ్రిఫ్ట్ పేరుతో రానున్న ఈ మోటార్ సైకిల్ లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ప్యూర్ ఈవీ సొంతంగా అభివద్ధి చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా స్థిరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని ఈ మోటార్ సైకిల్ ఇస్తుందని ప్యూర్ ఈవీ చెబుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) మోటారు సైకిళ్లతో పోలిస్తే ఎందులోనూ తీసిపోదని అంటోంది. దీని ధరను జనవరిలో ప్యూర్ ఈవీ ప్రకటిస్తుంది.

  • Loading...

More Telugu News