Chinese: వెంట ఉన్న వాటిని వదిలేసి.. బతుకు జీవుడా అని పరారైన చైనా బలగాలు

  • స్లీపింగ్ బ్యాగులు, ఎక్విప్ మెంట్ ను స్వాధీనం చేసుకున్న భారత సైన్యం
  • పారిపోయే క్రమంలో బరువైన వాటిని వదిలేసిన చైనా బలగాలు
  • డిసెంబర్ 9న చోటుచేసుకున్న ఘర్షణ 
Chinese troops leave behind equipment in retreat after Tawang clash

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తవాంగ్ సెక్టార్ యాంగ్తే వద్ద భారత వాస్తవాధీన రేఖలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చైనా బలగాలకు భారత సైనికులు గట్టిగా సమాధానమిచ్చారు. ఈ సమయంలో చైనా బలగాలు బతుకు జీవుడా అనుకుంటూ పలాయనం సాగించారు. ఈ క్రమంలో తమ వెంట తెచ్చుకున్న సామగ్రిని వదిలి పారిపోయారు. 

చైనా బలగాలు వదిలేసి వెళ్లిన వాటిని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అయినా రక్షించే స్లీపింగ్ బ్యాగులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, వస్త్రాలు, ఎక్విప్ మెంట్ కూడా స్వాధీనం చేసుకున్న వాటిల్లో ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులలో పనిచేసే సైనికుల వద్ద కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. దాపు 20 కిలోలకు పైగా బరువును వారు మోయాల్సి వస్తుంది. బరువైన వాటిని మోసుకుని వెళ్లడం కనుక వాటిని వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. డిసెంబర్ 9న చొరబాటు జరగడం తెలిసిందే. 300 మంది వరకు చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు రాగా, వారిని భారత సైన్యం నిలువరించి వెనక్కి పంపించేసింది. 

More Telugu News