Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే కన్నాతో సమావేశం: నాదెండ్ల

Nadendla talks to media after held meeting with Kanna Lakshminarayana
  • గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల భేటీ
  • పలు అంశాలపై చర్చించామన్న నాదెండ్ల
  • రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తామని వెల్లడి
ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ కావడం తెలిసిందే. ఈ సమావేశం ముగిసిన అనంతరం నాదెండ్ల, కన్నా మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అందరి మద్దతు కూడగడుతున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యామని వివరించారు. జగన్, ఆయన పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని విమర్శించారు. వైసీపీ పాలన పోవాలని, రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, అందుకోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. మిగతా విషయాలు పవన్ కల్యాణ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Nadendla Manohar
Kanna Lakshminarayana
Janasena
BJP
Guntur

More Telugu News