KCR: బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు కీలక నేతకు అప్పగింత.. అమరావతిలో భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్!

  • ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్
  • హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్న వైనం
  • తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే యోచన
KCR appoints Talasani as BRS AP incharge

తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఏపీలో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. సంక్రాంతికి ఏపీలో బీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది. 

ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

More Telugu News