Sai Ronak: రాసిపెట్టినట్టుందే .. 'రాజయోగం' వచ్చేసిందే.. సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్!

  • మరో ప్రేమకథా చిత్రంగా 'రాజయోగం'
  • హీరో హీరోయిన్స్ కి ఇదే ఫస్టు మూవీ 
  • సంగీత్ దర్శకుడు కూడా ఈ సినిమాతోనే పరిచయం
  • పాటకి ఫీల్ తెచ్చిన సిద్ శ్రీరామ్ ఆలాపన  
Rajayogam lyrical song released

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో ప్రేమకథల తాకిడి మరింత పెరిగింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే చిన్న సినిమాలే అయినా, మంచి కంటెంట్ తో యూత్ ను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా సినిమాలతో చాలామంది కొత్త హీరో హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. 

అలా రూపొందిన మరో ప్రేమకథా చిత్రమే 'రాజయోగం'. ఈ సినిమాతో సాయి రోనక్ - అంకిత సహ నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. మణి లక్ష్మణ్ రావు నిర్మించిన ఈ సినిమాకి, రామ్ గణపతి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'రాసిపెట్టి ఉన్నట్టుందే రాజయోగమొచ్చేసిందే .. నల్లనైన కన్నుల్లోకి వెన్నెలమ్మలా' అంటూ ఈ పాట సాగుతోంది. రెహ్మాన్ సాహిత్యంలో పదాల అమరిక బాగుంది. అలాగే తెలుగులో ఇదే ఫస్టు సినిమా అయినా, అరుణ్ మురళీధరన్ సమకూర్చిన బీట్ యూత్ కి పట్టేలా ఉంది. సిద్ శ్రీరామ్ వాయిస్ ఈ పాటకి ప్రాణం తీసుకొచ్చింది.

More Telugu News