'వీరసింహా రెడ్డి' నుంచి సెకండ్ సింగిల్ రెడీ!
- 'వీరసింహా రెడ్డి'గా బాలకృష్ణ
- రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
- అందాల సందడి చేయనున్న శ్రుతి హాసన్
- ఈ నెల 15న సెకండ్ సింగిల్ రిలీజ్
- జనవరి 12వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ కి రెడీ చేస్తోంది. తమన్ స్వరపరిచిన పాటల్లో నుంచి 'సుగుణ సుందరి' అంటూ సాగే పాటను, ఈ నెల 15వ తేదీన ఉదయం 9:42 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.
పవర్ఫుల్ పాత్రలో .. డిఫరెంట్ లుక్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మిగతా ముఖ్యమైన పాత్రలలో వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ .. రవిశంకర్ .. లాల్ కనిపించనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.