Nabha Natesh: అందాల నభా నటేశ్ ఆచూకీ ఎక్కడ?

Nabha Natesh Special
  • బొద్దు భామగా యూత్ ను ఆకట్టుకున్న నభా నటేశ్ 
  • 'ఇస్మార్ట్ శంకర్'లో అందాల సందడి చేసిన బ్యూటీ 
  • వరుస ప్రాజెక్టులను చేస్తూ వెళ్లిన నభా 
  • అవకాశాల మాదిరిగా అందని విజయాలు 
  • ఈ ఏడాదిలో ఒక్క సినిమా చేయని నభా
తెలుగు తెరపై అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం మొహమాటపడని కథానాయికగా నభా నటేశ్ కనిపిస్తుంది. ముద్దమందారంలా కనిపించే ఈ బ్యూటీ కన్నడ సినిమాలతో వెండితెరపైకి వచ్చింది. ఆ తరువాతనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అయిన 'నన్ను దోచుకుందువటే'తోనే సక్సెస్ ను సొంతం చేసుకుంది. 

'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నభా చేసిన అందాల సందడి వలన, ఆమెకి వరుస ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. రవితేజ .. నితిన్ .. సాయితేజ్ వంటి స్టార్స్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అయితే ఆ సినిమాలేవీ ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేదు. ఒకదానికి మించి మరొకటి ఫ్లాప్ టాక్ ను సంపాదించుకున్నాయి. 

ఫ్లాపులు రావడం సహజమే కనుక, ఇక్కడే ఉంటూ తాడో పేడో తేల్చుకుంటున్న వారు చాలామందినే ఉన్నారు. కానీ నభా మాత్రం ఆచూకీ లేకుండా పోయింది. ఈ ఏడాది ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. పోనీ ఇతర భాషల్లో బిజీగా ఉందా అంటే అదీ లేదు. ఈ సుందరితో పాటు తన జర్నీని మొదలెట్టిన నిధి అగర్వాల్ ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలోనే ఉంది.
Nabha Natesh
Nidhi Agarwal
Tollywood

More Telugu News