Virat Kohli: మా బాబర్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం: కోహ్లీని ఉద్దేశిస్తూ పాక్ ఫ్యాన్స్ ప్లకార్డులు

We Will Love You More Than Babar Azam Pakistan Fans Message To Virat Kohli
  • ముల్తాన్ టెస్టు సందర్భంగా ఫ్యాన్స్ ప్లకార్డులు
  • పాకిస్థాన్ కు వచ్చి ఆసియా కప్ ఆడాలని విన్నపం
  • వచ్చే ఏడాది పాక్ లో జరగనున్న ఆసియా కప్
కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన శత్రు దేశం పాకిస్థాన్ లో సైతం ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీపై అభిమానాన్ని పాక్ అభిమానులు మరోసారి చాటుకున్నారు. ముల్తాన్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో వారు కోహ్లీని ఉద్దేశించి ప్లకార్డులు ప్రదర్శించారు. 'హాయ్... కింగ్ కోహ్లీ ఆసియా కప్ ఆడు. మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే మేము నిన్నే ఎక్కువ ఇష్టపడతాం' అని ఇద్దరు ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఆసియా కప్ జరగనుంది. అయితే, పాకిస్థాన్ లో తాము ఆడబోము అని భారత్ స్పష్టం చేసింది. తమ దేశంలో ఆసియా కప్ ఆడకపోతే... ఇండియాలో జరిగే ప్రపంచకప్ లో తాము ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయినప్పటికీ బీసీసీఐ పట్టించుకోలేదు. పాకిస్థాన్ లో ఆడటమనేది బీసీసీఐ తీసుకునే నిర్ణయం కాదని... ఇది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే.... తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడాలంటూ కోహ్లీని పాక్ అభిమానులు కోరారు. 
Virat Kohli
Team New Zealand
Pakistan
Fans
Babar Azam

More Telugu News