Rajnath singh: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశం

Rajnath holds high level meet on LAC clashes set to address Parliament
  • చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఏర్పాటు
  • హాజరైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ చీఫ్
  • జాతీయ భద్రతా సలహాదారుతోనూ భేటీ
  • పార్లమెంటులో ప్రకటన చేయనున్న రాజ్ నాథ్ సింగ్

చైనా - భారత్ సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రక్షణ దళాల చీఫ్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ముఖ్య అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో తమాంగ్ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో ఇరువైపుల సైనికులు గాయపడ్డారు. 

ఈ ఘటనపై ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. దీనికంటే ముందు పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు పలు పార్టీలు పట్టుబడుతుండడం గమనార్హం. దీనిపై లోక్ సభలో వివరణ కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీసు జారీచేశారు.

  • Loading...

More Telugu News