రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అసమ్మతి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
- అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
- అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకు పోవాలన్న మంత్రి
- రాప్తాడు నుంచి పోటీ చేసేందుకు ఎవరు వచ్చినా పక్కకు తప్పుకుంటానన్న ఎమ్మెల్యే తోపుదుర్తి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సరే ఈ స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చుని మద్దతు ఇస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు సీటును ఇతరులకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.