Bellamkonda Ganesh: 'నేను స్టూడెంట్ సర్' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

  • యూత్ కి కనెక్ట్ అయ్యే కథతో 'నేను స్టూడెంట్ సర్'
  • బెల్లంకొండ గణేశ్ కి ఇది రెండో సినిమా 
  • కథానాయికగా అవంతిక పరిచయం
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
Nenu Student Sir lyrical song released

బెల్లంకొండ గణేశ్ తన రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' సినిమా చేశాడు. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గణేశ్ జోడీగా 'అవంతిక' పరిచయం కానుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'మాయే మాయే అంతా మాయే .. నిన్నే చూడకపోతే కళ్లే తిడుతున్నాయే' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చడమే కాయకుండా, కపిల్ కపిలన్ తో కలిసి ఆలపించారు.

కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించిన ఈ పాటకి, విశ్వ రఘు కొరియోగ్రఫీని అందించాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే లానే బీట్ ఉంది.  సముద్రఖని .. సునీల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ కూతురైన అవంతిక ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.

More Telugu News