hot water shower: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

US based doctor shares how skin can suffer due to a steamy bath
  • మరీ వేడి నీటి స్నానంతో చర్మానికి హాని
  • మంచి బ్యాక్టీరియా నశిస్తుందంటున్న నిపుణులు
  • హైపర్ టెన్షన్ కు దారితీస్తుందని హెచ్చరిక
  • మొటిమలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వెల్లడి
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! అయితే, నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే పరవాలేదు కానీ మరీ వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అమెరికా డాక్టర్ ఒకరు హెచ్చరిస్తున్నారు. నీళ్లు మరీ వేడిగా ఉంటే చర్మంలోని తేమ పోయి పొడిబారుతుందని, జుట్టు పెరుగుదల మందగిస్తుందని చెబుతున్నారు. శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా కూడా ఈ వేడి వల్ల నశిస్తుందని అంటున్నారు. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురద సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. తామర కూడా పెరుగుతుందని వివరించారు. 
స్కిన్ స్పెషలిస్ట్ అయిన ఆ డాక్టర్ ఇంకా ఏం చెప్పారంటే..

చర్మం పొడిబారుతుంది..
మన చర్మంలో నుంచి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా, చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసినా, బాత్ టబ్ లోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్నా అందులోని వేడి వల్ల ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడిబారి, కొత్త సమస్యలు ఎదురవుతాయి.

మొటిమలు..
ఇప్పటికే మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు వేడి నీటి స్నానంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని అమెరికా డాక్టర్ హెచ్చరించారు. వేడి నీళ్ల వల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో చర్మంలోని కణాలు నశిస్తాయని, వీటితో మొటిమలు మరింత పెరుగుతాయని వివరించారు. చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా ఈ వేడి నీళ్ల స్నానంతో చనిపోతుందని తెలిపారు.

జుట్టు పెరుగుదలపై ప్రభావం
స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ వేడిగా ఉంటే తల పైన రక్త ప్రసరణ వేగం తగ్గుతుందని డాక్టర్ తెలిపారు. దీనివల్ల జుట్టు పెరగుదల మందగిస్తుందని, జుట్టు రాలడం మరింత పెరుగుతుందని వివరించారు. 

హైపర్ టెన్షన్..
వేడి నీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించినా రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్ హెచ్చరించారు. రక్తప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్ కు కారణమవుతుందని అమెరికా డాక్టర్ వివరించారు.
hot water shower
winter
hair loss
allergies
hyper tension

More Telugu News