పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 తుది గడువు
- ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన కేంద్రం
- ఈసారి ఆలస్య రుసుంతో తుది గడువు
- 2023 మార్చి 31 లోపు లింక్ చేయకపోతే పాన్ నిరుపయోగం
- ట్విట్టర్ లో ప్రకటన చేసిన ఐటీ శాఖ
ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విధించిన సాధారణ గడువు ముగిసిందని, గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేసింది.