Chandrababu: విజయవాడ వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తరలించారు: చంద్రబాబు

Chandrababu alleges YCP leaders forcibly move people to BC meeting
  • విజయవాడలో వైసీపీ జయహో బీసీ సభ
  • నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా అంటూ చంద్రబాబు ఫైర్
  • ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని ఆరోపణ
  • జగన్ తోక కట్ చేస్తామని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీకి సైకో పాలన వద్దు, సైకిల్ పాలనే ముద్దు అని పేర్కొన్నారు. జగన్ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. విజయవాడ వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తీసుకొచ్చారని ఆరోపించారు. వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. 

అదే సమయంలో, టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ రెడ్డి తోకను త్వరలోనే కట్ చేస్తామని హెచ్చరించారు. 

ఇక, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఎదుర్కోలేక సంగం డెయిరీపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డికి సంగం వద్దంట... అమూల్ ముద్దంట అని విమర్శించారు. సంగం రైతుల సంస్థ అని, అమూల్ గుజరాత్ సంస్థ అని చంద్రబాబు అన్నారు.
Chandrababu
TDP
YCP
Jagan
Andhra Pradesh

More Telugu News