Kethika: అదృష్టం కోసం వెయిట్ చేస్తున్న అందాల కేతిక .. లేటెస్ట్ పిక్స్

Kethika Special
  • గ్లామరస్ హీరోయిన్ గా మెరిసిన కేతిక
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • నిరాశపరిచిన మూడు సినిమాలు
  • మొహం తిప్పేసుకున్న అవకాశాలు
  • కలిసొచ్చే కాలం కోసమే ఆమె వెయిటింగ్  
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో కేతిక ఒకరు. పూరి జగన్నాథ్ బ్యానర్ నుంచి ఒక హీరోయిన్ వచ్చిందంటే .. పూరి మెచ్చిన బ్యూటీ అంటే తప్పకుండా మేటర్ ఉంటుందని అంతా అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఈ సుందరి 'రొమాంటిక్' సినిమాకి సంబంధించిన ఫస్టు పోస్టర్ తోనే కుర్ర మనసుల్లో కుంపట్లు రాజేసింది. తన అభిమానుల జాబితాలో చేర్చేసుకుంది. గుమ్మడి పువ్వులా ఉన్న కేతికను చూడగానే కుర్రాళ్లకు కుదురు .. కునుకు లేకుండా పోయాయి.  గ్లామర్ పరంగా .. నటన పరంగా కృతి శెట్టి .. శ్రీలీలతో పాటు, తన జోరును చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. గ్లామర్ పరంగా నూటికి నూటొక్క మార్కులు పడ్డాయిగానీ, కథాకథనాల పరంగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ బొద్దుగుమ్మ కాస్త వెనకబడింది.

ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అవకాశం రావాలి .. దాని వెనుకే సక్సెస్ కూడా రావాలి. ఈ రెండూ రావాలంటే అందుకు తగిన అదృష్టం ఉండాలి. తనని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలోనే ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్ వదులుతోంది. కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు. కాకపోతే ఒక హిట్టుతో దిష్టి తీసేస్తేనేగాని లైన్లో పడదేమో! 
Kethika
Actress
Tollywood

More Telugu News