Tecno: రూ.12 వేలకే టెక్నో 5జీ స్మార్ట్ ఫోన్

Tecno launches a 5G smartphone under Rs 12000 in India here are the details
  • టెక్నో పోవా 4 పేరుతో విడుదల
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా విడుదల
  • ఈ నెల 13 నుంచి అమెజాన్, జియో మార్ట్ పై విక్రయాలు
బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ కోరుకునే వారి కోసం టెక్నో కంపెనీ ఒక ఫోన్ ను తీసుకొచ్చింది. టెక్నో పోవా 4 పేరుతో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999. అధిక స్టోరేజీ, మంచి పనితీరు ఈ ఫోన్ ప్రత్యేకతలుగా కంపెనీ తెలిపింది. గేమర్స్ కోసం, అధిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి అనుకూలమని పేర్కొంది. 

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఇది వస్తుంది. 6.82 అంగుళాల హెచ్ డీ ప్లస్ డాట్ ఇన్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్, పాంథర్ గేమ్ ఇంజన్ 2.0, హైపర్ ఇంజన్ 2.0 లైట్ (గేమింగ్ కోసం) ఫీచర్లు ఉన్నాయి. స్టోరేజీని 2టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. 

6,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ అడాప్టర్ వస్తుంది. 10వాట్ రివర్స్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంది. 10 ఎక్స్ జూమ్ తో, 2కే సపోర్ట్  వీడియోలు తీసుకోవచ్చు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇది కూడా 2కే వీడియోకు సపోర్ట్ చేస్తుంది. సైరోలైట్ బ్లూ, ఉరానోలిత్ గ్రే, మ్యాగ్మా ఆరెంజ్ రంగుల్లో వస్తుంది. ఈ నెల 13 నుంచి అమెజాన్, జియోమార్ట్ పై కొనుగోలు చేసుకోవచ్చు.
Tecno
launches
5G smartphone
Tecno pova 4
Rs 12000

More Telugu News