Hardhik Patel: కాంగ్రెస్ ఓడిపోతుండటానికి కారణం ఇదే: హార్దిక్ పటేల్

Congress has no vision says BJP leader Hardhik patel
  • 150కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ
  • కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదన్న హార్దిక్ పటేల్
  • వీరంగామ్ స్థానంలో లీడ్ లో ఉన్న హార్దిక్
గుజరాత్ లో వెలువడుతున్న ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 152 స్థానాల్లో లీడ్ లో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో పటిదార్ ఆందోళన్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీ మరోసారి ఆధికారాన్ని చేపట్టబోతోందని చెప్పారు. 

ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ ఎంతో చేసిందని... అందుకే జనాలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదని... అందుకే ఆ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతూనే వస్తోందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి హార్దిక్ పటేల్ చేరిన సంగతి తెలిసిందే. వీరంగామ్ స్థానం నుంచి బీజేపీ తరపును పోటీ చేసిన హార్దిక్ ముందంజలో ఉన్నారు.
Hardhik Patel
BJP
Gujarat
Election Results
Congress

More Telugu News