Telugu TV Anchor: కోరిక తీర్చాలంటూ తెలుగు టీవీ యాంకర్‌పై వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన యువతి

Telugu TV Anchor Files Case Against His Friend for Photo Morphing
  • మధురానగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతి
  • కాలేజీలో చదువుకునే రోజుల్లో సహ విద్యార్థితో పరిచయం
  • ప్రేమను నిరాకరించడంతో కక్షగట్టిన యువకుడు
  • యువతి చిత్రాలను మార్ఫింగ్ చేసి వేధింపులు
తన కోరిక తీర్చాలంటూ ఓ తెలుగు టీవీ యాంకర్‌ను వేధిస్తున్న యువకుడిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి (27) ఓ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. 

కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్ (30)తో బాధిత యువతికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్టు చెప్పడంతో యువతి నిరాకరించింది. దీంతో ప్రేమించకుంటే సరే కానీ, స్నేహితుల్లా ఉందామంటూ ఆమెను నమ్మించాడు. ఓసారి కారులో యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన సామ్రాట్ ఆమెపై అత్యాచారానికి యత్నించగా చాకచక్యంగా తప్పించుకుంది. 

దీంతో ఆమెపై కక్షగట్టిన సామ్రాట్ ఆమె ఫొటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telugu TV Anchor
SR Nagar Police Station
Crime News
Hyderabad

More Telugu News