స్టేజ్ పై ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్!
- ఐదు కథల కలయికగా 'పంచతంత్రం'
- కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 'లేఖ' పాత్ర తనకి పేరు తెస్తుందన్న శివాత్మిక
- ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ వేడుకకి జీవిత రాజశేఖర్ - హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స్టేజ్ పై శివాత్మిక మాట్లాడుతూ .. "దర్శకుడు హర్ష నాకు కథ చెబుతున్నప్పుడే నేను ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. 'నువ్వు ఈ సినిమా చేస్తున్నావు' అంటూ నేను ఆ క్షణమే ఒప్పుకునేలా చేశారు. నాపై అంత నమ్మకం ఉంచినందుకు హ్యాపీగా ఉంది" అంది.
"ఈ సినిమాలో నేను పోషించిన 'లేఖ' పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఐదు కథలను చూస్తుంటే .. ఐదు సినిమాలను చూస్తున్నట్టుగా ఉంటుంది. బ్రహ్మానందం .. స్వాతి వంటి ఆర్టిస్టులతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాతో మా అందరికీ సక్సెస్ రావాలి .. అందువలన ఈ సినిమా తప్పకుండా ఆడాలండీ బాబూ" అంటూ ఏడ్చేసింది.