GPay: యూపీఐ చెల్లింపులపై పరిమితులు.. మీకు తెలుసా?

  • ఒక రోజులో యూపీఐ ద్వారా రూ.లక్ష వరకే పంపుకోవచ్చు
  • ఒక రోజులో 20 లావాదేవీలకే పరిమితి
  • ఈ పరిమితులు దాటితే మరుసటి రోజు వరకు వేచి చూడాల్సిందే
UPI transaction limit This is how much you can spend using GPay PhonePe Paytm daily

నేడు దాదాపు అన్ని చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) కీలకంగా మారింది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేయడానికే అందరూ మొగ్గు చూపిస్తున్నారు. కనుక యూపీఐ పరంగా ఉన్న పరిమితులపై అవగాహన ఉండడం అవసరం.


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో యూపీఐ ద్వారా రూ.లక్ష వరకే పంపుకోగలరు. ఇది ఎన్ పీసీఐ పెట్టిన పరిమితి. కానీ, బ్యాంకులు సైతం విడిగా పరిమితులు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్ బీఐ అయితే ఒక రోజులో గరిష్ఠ పరిమితి అయిన రూ.లక్ష వరకు పంపుకునేందుకు అనుమతినిస్తోంది. కెనరా బ్యాంకు రూ.25,000 వరకే యూపీఐ ద్వారా ఒక రోజులో అనుమతినిస్తోంది. ఇక ఒక రోజులో యూపీఐ లావాదేవీల పరంగానూ పరిమితి ఉంది. ఒక రోజులో గరిష్ఠంగా 20 యూపీఐ లావాదేవీల వరకే చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే మరుసటి రోజు వరకు వేచి ఉండక తప్పదు. 

గూగుల్ పే/ఫోన్ పే/పేటీఎం
గూగుల్ పే ఒక రోజులో ఎన్ పీసీఐ నిబంధనల మేరకు రూ.లక్ష వరకు పంపుకునేందుకు అనుమతినిస్తోంది. లావాదేవీల పరిమితి కూడా 20గానే ఉంది. ఫోన్ పే, అమెజాన్ పే సైతం ఇదే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. పేటీఎం రోజులో గరిష్ఠంగా రూ.లక్ష పంపుకునేందుకు అనుమతినిస్తోంది. కాకపోతే ఒక గంటలో రూ.20వేల పరిమితిని అమలు చేస్తోంది. గంటలో 5 లావాదేవీల వరకు పేటీఎంలో చేసుకోవచ్చు.

More Telugu News