Jagan: రేపు విజయవాడ, నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

CM Jagan will visit Vijayawada and Nellore tomorrow
  • రేపు విజయవాడలో బీసీ సభ
  • హాజరుకానున్న సీఎం జగన్
  • మధ్యాహ్నం నెల్లూరు పయనం
  • సూళ్లూరుపేట ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరు
ఏపీ సీఎం జగన్ రేపు (డిసెంబరు 7) విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్నారు. రేపు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 'జయహో బీసీ' సభ జరగనుండగా, ఉదయం 11.50 గంటలకు సీఎం జగన్ ఈ సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సభలో పాల్గొంటారు. 

మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు బయల్దేరతారు. మధ్యాహ్నం 3.25 గంటలకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు. ఈ రిసెప్షన్ కార్యక్రమం స్థానిక వీపీఆర్ కన్వెన్షన్ లో జరగనుంది. రేపు సాయంత్రం 6.20 గంటలు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

కాగా, ఇవాళ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించాలని భావించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
Jagan
Vijayawada
Jayaho BC
Nellore District
YSRCP
Andhra Pradesh

More Telugu News