Ukraine: భారత్ పై ఉక్రెయిన్ మంత్రి విమర్శలు

  • రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందుతున్న భారత్
  • ఉక్రెయిన్ల బాధల నుంచి లబ్ధి పొందడం భారత్ కు తగదన్న ఆ దేశ మంత్రి
  • యుద్ధం ముగిసేందుకు మోదీ యత్నించాలని విన్నపం
Ukraine minister comments on India

రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ప్రతిరోజూ తమ ప్రజలు చనిపోతున్నారని... ఇదే సమయంలో భారత్ లాభపడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమెత్రో కుబేలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందే అవకాశం భారత్ కు వచ్చిందని అన్నారు. నైతికంగా భారత్ కు ఇది తగదని వ్యాఖ్యానించారు. 'ఉక్రెయిన్ పడుతున్న బాధల వల్ల మీరు లబ్ధి పొందుతున్నట్లయితే... మాకు మరింత సాయం చేయాలని' అన్నారు. మీకు చౌకగా చమురు లభిస్తుండటం వెనుక ఉక్రెయిన్లు అనుభవిస్తున్న బాధలను చూడాలని ఇండియాను కోరారు. 

రష్యాతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే యుద్ధం విషయంలో రష్యా తీరును వ్యతిరేకించిందని... అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు మాత్రం దూరంగా ఉందని కులేబా అన్నారు. భారత ప్రధాని మోదీకి తన స్వరంతో, శక్తితో దేన్నయినా మార్చగల స్థాయి ఉందని... అందుకే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోయేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేయాలని కోరారు.

More Telugu News