Devineni Avinash: వైసీపీ నేత దేవినేని అవినాశ్ నివాసంలో ఐటీ దాడులు

  • తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు
  • ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు
  • వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో పెట్టుబడులపై ఆరా?   
IT raids in Devineni Avinash house

ఏపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఐటీ అధికారులు అవినాశ్ ఇంటికి చేరుకుని దాడులు జరుపుతున్నారు. 

దాడుల వెనుక ఉన్న కారణం ఏమిటనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ... హైదరాబాద్ లో ఉన్న వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో దాడులు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఐటీ దాడులు విజయవాడలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపాయి.

More Telugu News