వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వేటు

AP Govt issued memos to out sourcing employees
డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న 17 మంది ఔట్  సోర్సింగ్ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటేసింది. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వీరికి ఈ నెల 1న మెమో జారీ చేసింది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న దాదాపు 350  మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. 

రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మందిని ఆప్కాస్ విభాగంలోకి తీసుకురాగా, మిగతా 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. వీరిలో పదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు 60 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఆప్కాస్‌లో చేరిన వారిలో 17 మందిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్, ఔట్  సోర్సింగ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Out Sourcing Employees
Memo

More Telugu News