ఫస్టు కాల్ మహేశ్ బాబు నుంచి వచ్చింది: అడివి శేష్
- 'హిట్ 2' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో అడివి శేష్
- రిలీజ్ రోజున చాలా టెన్షన్ పడ్డానని వెల్లడి
- మహేశ్ బాబు మెచ్చుకోవడంతో కన్నీళ్లొచ్చాయని వివరణ
- థియేటర్ రెస్పాన్స్ ను మరిచిపోలేనని వ్యాఖ్య
"మహేశ్ బాబుగారికి ఆ క్షణమే నేను కాల్ చేశాను. ' నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్' అన్నారాయన. ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తరువాత ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వలన నా షోకి నేనే లేట్ గా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్ట్ చేయడం కంటే నాకు కావలసిందేం ఉంటుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.