కూతురిని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు: మాజీ మంత్రి రవీంద్ర నాయక్
- కేసీఆర్ పై రవీంద్ర నాయక్ విమర్శనాస్త్రాలు
- టీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు మర్యాద లేదని వెల్లడి
- పరపతి కోసం సెంటిమెంట్ రగల్చడం కేసీఆర్ కు అలవాటని వ్యాఖ్యలు
కేసీఆర్ తన పరపతి కోల్పోయినప్పుడల్లా సెంటిమెంట్ రగుల్చుతారని రవీంద్ర నాయక్ విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూతురిని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.