Tollywood: నేడే నటి హన్సిక పెళ్లి.. ప్రత్యేక అతిథులు వీళ్లే..!

special guests for hansika wedding
  • నేడు ప్రియుడు సోహైల్ ను పెళ్లాడనున్న హన్సిక
  • జైపూర్ లోని ఓ రాజకోటలో పెళ్లి వేడుక
  • కొందరు పేద చిన్నారులకు ప్రత్యేక ఆహ్వానం
బాలనటిగా అలరించి, 'దేశముదురు' చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి హన్సిక. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాలతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తను ఆదివారం పెళ్లి బంధంతో కొత్త జీవితం ప్రారంభించనుంది. తన ప్రియుడు సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది.

రాజకోటలో జరిగే పెళ్లికి ప్రత్యేక ఆహ్వానాలు అంటే పెద్ద సెలబ్రిటీలు అనుకోవడం సహజం. కానీ, హన్సిక ప్రత్యేకంగా పిలిచింది నీరుపేద చిన్నారులను కావడం విశేషం. హన్సిక తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఆహ్వానాలు పంపించి తన మంచి మనసు చాటుకుంది. పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.

 ఇక, వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులకు హన్సిక ఈ రోజు భోజనాన్ని పంపించనుంది. కాగా, పెళ్లికి ముందు జరిగే మెహెందీ, సంగీత్ లో కాబోయే దంపతులు హన్సిక, సోహైల్ ఆహ్లాదంగా గడిపారు. సంగీత్ లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను హన్సిక సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Tollywood
Kollywood
hansika
weddik
jaipur
special
guests

More Telugu News