పీవోకే పై భారత్ కలలు కల్లలే: పాక్ ఆర్మీ చీఫ్
- ఒక్క ఇంచు జాగాను కూడా వదులుకోమన్న అసీం మునీర్
- దేశాన్ని కాపాడుకోవడం పాక్ సైనికులకు బాగా తెలుసని వ్యాఖ్య
- పీవోకే విషయంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కునేందుకైనా సిద్ధమని వెల్లడి
మాతృభూమిని కాపాడుకోవడానికి పాక్ సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని వివరించారు. శత్రువుకు ధీటుగా జవాబు చెబుతారని మునీర్ పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారంపై భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మీడియాతో మాట్లాడారు. పీవోకే ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిస్తే వెంటనే అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
దీనిపై తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ స్పందించారు. తమ దేశ భూభాగాన్ని కాపాడుకోవడం పాక్ సైనికులకు తెలుసని చెప్పారు. పీవోకే విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.