Poonam Kaur: ఫైబ్రోమయాల్జియా వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్?

Poonam Kaur in suffering from rare decease
  • రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్
  • కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న వైనం
  • ఈ వ్యాధికి గురైన వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఫైబ్రోమయాల్జియా అనే ఒక అరుదైన సమస్యతో ఆమె బాధపడుతోందట. ఈ వ్యాధి ఉన్నవారు అలసటకు గురవుతారు. వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కండరాల నొప్పికి గురవుతారు. నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందట. 

రెండేళ్ల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం. ఎస్వీ కృష్ణారెడ్డి 'మయాజాలం' సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. మరోవైపు హీరోయిన్ సమంత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News