జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
- ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా జీ-20
- ఏడాదిపాటు జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్
- ఇటీవల ఇండోనేషియాలో జీ-20 సదస్సు
- ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలు భారత్ కు బదిలీ
భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు.