Saroja Alluri: మిసెస్ ఆసియా యూఎస్ఏ‌గా విశాఖ మహిళ

Visakha Woman Alluri Saroja Won Mrs Asia USA Crown
  • కాలిఫోర్నియాలో ఈ నెల 19న ‘మిసెస్ ఆసియా’ పోటీలు
  • కిరీటాన్ని అందుకున్న తొలి దక్షిణ భారత మహిళగా రికార్డు
  • అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 పోటీల్లో విశాఖపట్టణానికి చెందిన అల్లూరి సరోజ విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఫలితంగా ఈ టైటిల్ గెలుచుకున్న దక్షిణాదికి చెందిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. అలాగే, ‘మిసెస్ ఆసియా’ టైటిల్‌తోపాటు ‘మిసెస్ పాప్యులారిటీ’, ‘పీపుల్స్ చాయిస్’ అవార్డులు కూడా అందుకున్నారు.

అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ.. భర్త, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో కలిసి లాస్‌ఏంజెలెస్‌లో నివసిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన సరోజ మంచి డ్యాన్సర్ కూడా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు.  

Saroja Alluri
Mrs Asia Usa 2023
USA
Visakhapatnam

More Telugu News