Adivi Sesh: 'హిట్' సిరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా చీఫ్ గెస్టు రాజమౌళిగారే: దర్శకుడు శైలేశ్ కొలను

  • నాని సొంత బ్యానర్లో నిర్మితమైన 'హిట్ 2' 
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే కథ 
  • అడివి శేష్ జోడీ కట్టిన మీనాక్షి చౌదరి 
  • రాజమౌళి ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల        
HIT 2 Pre Release Event

అడివి శేష్ హీరోగా 'హిట్ 2' సినిమా రూపొందింది. నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాదు .. ఫిల్మ్ నగర్ లోని 'జేఆర్సీ కన్వెన్షన్' లో నిర్వహించారు. రాజమౌళి ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది.

ఈ స్టేజ్ పై దర్శకుడు శైలేశ్ కొలను మాట్లాడుతూ .. "ముందుగా రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో 'హిట్' సినిమాకి కూడా రాజమౌళిగారే వచ్చి  బ్లెస్ చేశారు .. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. రాజమౌళి గారు హాలీవుడ్ కి వెళ్లిపోయినా .. ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా, 'హిట్' సిరీస్ లోని అన్ని సినిమాలకు ఆయనే చీఫ్ గెస్టుగా రావాలని కోరుకుంటున్నాను. 

'హిట్ 1' నచ్చినవారికి 'హిట్ 2' తప్పకుండా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. 'హిట్ 1' ను మించి ఈ సినిమా ఉంటుందని నేను నమ్మకంగా చెప్పగలను. ఇది పూర్తిస్థాయిలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చే సినిమా .. థియేటర్స్ లోనే దీనిని చూడాలి. నా టెక్నీషియన్స్ అందరి అంకితభావం కారణంగానే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది. తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News