Jayamalini: ఎక్కువ సినిమాలు చేసింది ఆ హీరోలతోనే: జయమాలిని

Jayamalini Interview
  • ఒకప్పటి ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన జయమాలిని
  • పెళ్లి తరువాత సినిమాలకి దూరం
  • 2014 తరువాత కనిపించిన జయమాలిని 
  • ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తో ఎక్కువ సినిమాలు చేశానని వెల్లడి
టాలీవుడ్ లో ఒకప్పటి ఐటమ్ సాంగ్స్ లో జయమాలిని ఒక వెలుగు వెలిగారు. దశాబ్దాల పాటు ఆమె తన జోరును చూపించారు. జయమాలిని తరువాత ఐటమ్ సాంగ్స్ కోసం మాత్రమే వచ్చిన తారలు చాలామందే ఉన్నారు. అయితే, గ్లామర్ పరంగా జయమాలినిని బీట్ చేసినవారు మాత్రం ఇంతవరకూ రాలేదనే చెప్పాలి. 

తాజాగా ఏబీఎన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ, "అప్పటి హీరోలందరితోను కలిసి నటించాను. ఎన్టీఆర్ గారు .. కృష్ణగారితో ఎక్కువ సినిమాలు చేశాను. అప్పట్లో రామరావుగారిని అందరం కూడా 'పెద్దాయన' అనే పిలుచుకునే వాళ్లం. నాగేశ్వరరావు గారు సెట్లో చాలా సందడి చేసేవారు. ఎన్టీఆర్ గారు అంటే భయంతో కూడిన భక్తి ఉండేది. ఏఎన్నార్ గారు అంటే భయం లేని భక్తి ఉండేది" అన్నారు. 

"పెళ్లి తరువాత సినిమాలు చేయవద్దని మా వారు చెప్పలేదు .. నేనే మానేశాను. నేను ఏ సినిమా ఫంక్షన్ లకు వెళ్లేదానిని కాదు. 2014 నుంచే నేను బయటికి రావడం జరుగుతోంది. చెన్నైలో ఉన్న అప్పటి హీరోయిన్స్ అంతా మా ఇంటికి వస్తూనే ఉంటారు. నేను వాళ్ల ఇంటికి వెళుతూనే ఉంటాను. ఇప్పటి హీరోలంతా కూడా డాన్సులు బాగా చేస్తున్నారు. వాళ్ల సినిమాలను నేను చూస్తూనే ఉంటాను" అంటూ చెప్పుకొచ్చారు.
Jayamalini
Tollywood

More Telugu News