Seediri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజుకు మళ్లీ టికెట్ ఇచ్చారో.. ఓడిస్తాం జాగ్రత్త: హెచ్చరించిన అసమ్మతి వర్గం

will defeat minister Seediri Appalaraju in next elections says leaders
  • మంత్రి సీదిరి ఎమ్మెల్యే కావడం కోసం సీనియర్లు సహకరించారన్న నేతలు
  • ఇప్పుడు వారినే ఆయన అవమానిస్తున్నారని ఆగ్రహం
  • మంత్రి అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్
మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోమారు టికెట్ ఇస్తే ఓడిస్తామని పలాస నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేతలు హెచ్చరించారు. జిల్లాలోని మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో నిన్న వనభోజనాల సందర్భంగా జరిగిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి సీదిరి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యే అయ్యేందుకు సీనియర్లు ఎంతగానో సహకరించారని, ఇప్పుడు వారినే ఆయన అవమానిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పలాస-కాశిబుగ్గ పురపాలక సంఘం కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ సహా పలువురు పాల్గొన్నారు.
Seediri Appalaraju
Andhra Pradesh
YSRCP
Palasa

More Telugu News