Jogi Ramesh: పవన్ కల్యాణ్ వల్ల ఇప్పటం గ్రామం పరువు పోయింది: మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh said Pawan Kalyan causes to Ippatam village lost its prestige
  • ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు జరిమానా
  • స్పందించిన మంత్రి జోగి రమేశ్
  • పవన్ రెచ్చగొట్టడం వల్లే గ్రామస్తులు కోర్టుకెళ్లారని వెల్లడి
  • పవన్ దొడ్డిదారిన పారిపోయే రకం అని విమర్శలు
ఇటీవల ఏపీ హైకోర్టు ఇప్పటం గ్రామస్తులకు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ కారణంగా ఇప్పటం గ్రామం పరువుపోయిందని అన్నారు. ఇప్పటం ప్రజల గుండెల్లో పవన్ గునపం దించాడని వ్యాఖ్యానించారు. అభం శుభం తెలియని గ్రామస్తులను రెచ్చగొట్టి, వారిని కోర్టుకు పంపించాడని, కోర్టు వారికి జరిమానా విధించిందని తెలిపారు. 

"దీనికి కారణం ఎవరు?... పవన్ కల్యాణ్ కాదా...? జనాలు ఇతడిని నమ్ముతారా? నెలకోసారి విజిటింగ్ వీసాపై వచ్చి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రజలను రెచ్చగొట్టి దొడ్డిదారిన పారిపోతాడు" అని విమర్శించారు. 

"వైసీపీ కంచుకోటను నువ్వు అంగుళం కూడా కదిలించలేవు పవన్ కల్యాణ్. నువ్వు భీమవరంలో ఓడిపోయావు, గాజువాకలో ఓడిపోయావు. ఈసారి అయినా గెలుస్తావా? అసలు వచ్చే ఎన్నికల్లో నువ్వు నిలబడతావా? 175 నియోజకవర్గాల్లో నీ జనసేన అభ్యర్థులతో పోటీ చేయించే సత్తా నీకుందా? నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థివా? ముందు అది తేల్చుకో. నువ్వు సాయపడేది ఎవరికి? నువ్వు సాగిలపడేది ఎవరికి? నువ్వు తొత్తుగా మారేది ఎవరికి?... చంద్రబాబుకే. చంద్రబాబు ఏది చెబితే అది చేసే వ్యక్తి ఈ పవన్ కల్యాణ్. ఇది జనసేన కాదు సైకో సేన" అంటూ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు.
Jogi Ramesh
Pawan Kalyan
Ippatam
YSRCP
Janasena

More Telugu News