తెలంగాణ పోలీస్ నియామకాల ఈవెంట్స్ తేదీలివే..!

  • వివరాలు వెల్లడించిన టీఎస్ఎల్ పీఆర్ బీ
  • నవంబర్ 29 నుంచి అడ్మిట్ కార్డులు జారీ
  • రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్న బోర్డు
తెలంగాణ పోలీసు నియామక పరీక్షల కోసం నిరుద్యోగ అభ్యర్థుల నిరీక్షణకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెరదించింది. వచ్చే నెలలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్ (టీఎస్ఎల్ పీఆర్ బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి పీఎంటీ, పీఈటీ టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 

అభ్యర్థులు నవంబర్ 29న ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్.. మొత్తం 11 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపింది. 

ఈవెంట్స్ ను డిసెంబర్ 8 న మొదలుపెట్టి 25 రోజుల్లోగా పూర్తిచేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tslprb.in/ అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాలని సూచించింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే.. support@tslprb.in కి మెయిల్ చేయడం గానీ, 93937 11110, 93910 05006 నెంబర్లకు కాల్ చేసి గానీ క్లారిఫై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

TSLPRB
events
Telangana
Police recrutment
pmt
pet
si
conistable

More Telugu News