central minister: ప్రజల సమస్యల పరిష్కారానికే పాదయాత్ర: కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy Padayatra ongoing in Secunderabad Parliament Constituency
  • సికింద్రాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన కేంద్ర మంత్రి
  • స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి
  • డబుల్ బెడ్ రూం ఇళ్లపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడి
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి పాదయాత్ర చేపట్టారు. ఉదయం మొదలుపెట్టిన ఈ యాత్ర సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తుకారాం గేట్ బస్తీలో కొనసాగింది.

స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మంత్రి కిషన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

ఆదివారం మధ్యాహ్నం బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. సోమవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
central minister
Kishan Reddy
BJP
padayatra
secunderabad

More Telugu News