Team New Zealand: హమిల్టన్ వన్డే: ఆటను ఆపేసిన వరుణుడు

Rain Stops Play India Kiwis Second One day
  • 4.5 ఓవర్ల వద్ద ఆగిన ఆట
  • భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం
  • మ్యాచ్ కొనసాగడం కష్టమే!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (2), శుభమన్ గిల్ (19) క్రీజులో ఉన్నారు.  

వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండడంతో అంతకుముందు టాస్ కూడా వాయిదా పడింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. అయితే, మ్యాచ్ మాత్రం కొనసాగేలా కనిపించడం లేదు. హమిల్టన్‌లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉండడమే అందుకు కారణం. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా దీపక్ హుడా, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారు.
Team New Zealand
Team India
Hamilton

More Telugu News