Anil Ravipudi: 'ఆహా'లో అనిల్ రావిపూడి 'కామెడీ స్టాక్ ఎక్చేంజ్' .. ప్రోమో రిలీజ్!

- 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కామెడీ షో
- న్యాయమూర్తిగా అనిల్ రావిపూడి
- యాంకర్స్ గా సుడిగాలి సుధీర్ - దీపిక పిల్లి
- డిసెంబర్ 2న ఫస్టు ఎపిసోడ్ స్ట్రీమింగ్
- సందడి చేస్తున్న ప్రోమో
'ఆహా'లో వినోదం పాళ్లు పెంచుతూ వెళుతున్నారు. ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లు .. టాక్ షోలు నెటిజన్లకు కావలసిన ఎంటర్టయిన్మెంట్ ను పుష్కలంగా అందిస్తున్నాయి. తాజాగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఓ కామెడీ షోను అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ కామెడీ షోకి అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.

అనిల్ రావిపూడి చేసిన ఈ కామెడీ షో పేరు 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్'. డిసెంబర్ 2వ తేదీన ఫస్టు ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన 'ప్రోమో'ను వదిలారు. సుడిగాలి సుధీర్ - దీపికా పిల్లి యాంకర్స్ గా వ్యవహరిస్తుండగా, 'జబర్డస్త్' .. 'పటాస్' షోస్ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ సందడి చేయనున్నారు.