Fire Boltt: పెద్ద స్క్రీన్ తో ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్ వాచ్

Fire Boltt Ninja Call Pro Plus with huge display Bluetooth calling launched in India priced under Rs 2000
  • దీని ధర రూ.1,999
  • బ్లూటూత్ కాలింగ్ ఫీచర్
  • హార్ట్ రేట్, ఆక్సిజన్ శాచురేషన్ తెలుసుకోవచ్చు
  • 100కు పైగా స్పోర్ట్ మోడ్స్
ఫైర్ బోల్ట్ కంపెనీ ‘నింజా కాల్ ప్రో ప్లస్’ పేరుతో ఒక స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. దీని ధర రూ.1,999. డిస్ ప్లే పెద్దగా ఉండాలని కోరుకునే వారికి ఇది అనుకూలం. ధర తక్కువే అయినా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రే, పింక్ రంగుల్లో ఇది లభిస్తుంది. అమెజాన్ లేదంటే ఫైర్ బోల్ట్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. బోట్, బౌల్ట్ కంపెనీలతో ఫైర్ బోల్ట్ కు సంబంధం లేదని గమనించాలి. 

1.83 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే తో ఇది ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కు ఈ వాచ్ ను కనెక్ట్ చేసుకుంటే.. ఇక ఫోన్ తో పని లేకుండా స్మార్ట్ వాచ్ నుంచే కాల్స్, మెస్సేజ్ లను కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యూజిక్ వినొచ్చు. ఈ వాచ్ లో 100కు పైగా స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నదీ తెలుసుకోవచ్చు. అలాగే, హార్ట్ రేటు, ఎస్పీవో2 ఎంతుందో కూడా చెబుతుంది. రిమైండర్లను కూడా పెట్టుకోవచ్చు.
Fire Boltt
Ninja Call Pro Plus
smart watch
big display

More Telugu News