BL Santhosh: ఫామ్ హౌస్ కేసులో ట్విస్ట్.. బీఎల్ సంతోష్ పై కేసు నమోదు

SIT files case against BJP leader BL Santhosh
  • సంతోష్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు
  • వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా నోటీసులు
  • ఈ నెల 26న లేదా 28న విచారణకు హాజరుకావాలని ఆదేశం
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారనే కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. 

మరోవైపు సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు రెండు తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు సంతోష్ వాట్సాప్, ఈమెయిల్ కు కూడా నోటీసులు పంపారు.
BL Santhosh
BJP
Notices
Case

More Telugu News