ఆసక్తిని రేపుతున్న 'హిట్ 2' ట్రైలర్!

Hit 2 movie trailer released
షార్ట్స్‌లో చూడండి
అడివి శేష్ హీరోగా 'హిట్ 2' సినిమా రూపొందింది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని ఈ సినిమాను నిర్మించాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి అలరించనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాదులోని ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించింది. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సంజన అనే ఒక యువతి హత్య కేసును గురించి పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణ జరపడాన్ని ట్రైలర్ లో చూపించారు. ఫైనల్ టచ్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు.   

'మేజర్' వంటి సూపర్ హిట్ తరువాత శేష్ చేసిన సినిమా కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక 'హిట్' తో మెప్పించిన శైలేశ్ కొలను, కంటెంట్ పరంగాను .. తారాగణం పరంగాను అంతకుమించి అనే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  

Go Back to Shorts
Adivi Sesh
Meenakshi Choudary
Sailesh Kolanu
HIT 2 Movie

More Telugu News