Rinku: జైల్లో ఆప్ మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా...?

Man who massages Satyendra Jain was accused of raped his own daughter
  • ఆప్ మంత్రి సత్యేంద్రజైన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • జైన్ పై ఈడీ విచారణ.. తీహార్ జైల్లో ఉన్న మంత్రి
  • మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ 
మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఇటీవల లీక్ కావడం తెలిసిందే. సత్యేంద్ర జైన్ మంచంపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా, ఓ వ్యక్తి ఆయనకు మసాజ్ చేస్తూ కనిపించాడు. 

అయితే, ఆ మసాజ్ చేసిన వ్యక్తి ఎవరన్నది తాజాగా వెల్లడైంది. ఆ వ్యక్తి కూడా జైలు ఖైదీయే. అతడు కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి పేరు రింకూ. 10వ తరగతి చదువుతున్న కూతురిని రేప్ చేశాడంటూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతేడాది అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అలాంటి వ్యక్తితో ఆప్ మంత్రి జైల్లో మసాజ్ చేయించుకోవడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాజ్ క్షమాపణలు చెప్పాలని, మంత్రి సత్యేంద్ర జైన్ ను ఇకపై ఒక్క నిమిషం కూడా క్యాబినెట్ లో కొనసాగించరాదని బీజేపీ డిమాండ్ చేసింది.
Rinku
Satynedra Jain
Massage
Tihar Jail
AAP
Delhi

More Telugu News