Kalvakuntla Himanshu: డీజే స్నేక్ ను కలిసిన కల్వకుంట్ల హిమాన్షు... ఫొటోలు వైరల్

Kalvakuntla Himanshu met DJ Snake in Hyderabad
  • హైదరాబాదులో సన్ బర్న్ ఈవెంట్
  • డీజే స్నేక్ కచేరీ ఏర్పాటు
  • డీజే స్నేక్ తో ఫొటోలు దిగిన హిమాన్షు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇటీవల ఫ్రెంచ్ సంగీతకారుడు డీజే స్నేక్ ను కలిశారు. డీజే సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి, డీజేనే తన ఇంటి పేరుగా మార్చుకున్న డీజే స్నేక్ అసలు పేరు విలియమ్ సామి ఎటియన్నె గ్రిగహసిన్. కాగా, డీజే స్నేక్ సంగీత కచేరీ ఈ నెల 20న హైదరాబాదులో జరిగింది. 

సన్ బర్న్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల హిమాన్షు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను హిమాన్షు సోషల్ మీడియాలో పంచుకున్నారు. డీజే స్నేక్ ను కలవడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. తాను ఇప్పటివరకు కలిసిన వారిలో డీజే స్నేక్ ఎంతో వినయశీలి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడారు.
Kalvakuntla Himanshu
DJ Snake
Concert
Hyderabad
TRS
Telangana

More Telugu News