Chandrababu: జగన్ సభలో మహిళల చున్నీలను తీయించడం దారుణం: చంద్రబాబు

It is atrocious to remove womens chunnys in Jagan Sabha says Chandrababu
  • నిన్న నరసాపురంలో సీఎం జగన్ కార్యక్రమం
  • బురఖాలు వేసుకున్న మహిళలను సభలోకి రానివ్వరా అని చంద్రబాబు ప్రశ్న
  • ఇది పోలీసు భద్రత కాదు.. జగన్ అభద్రత అని వ్యాఖ్య
నరసాపురంలో నిన్న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం సభ వద్ద మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 

ఇప్పటికే పరదాలు, బ్యారికేడ్ల మధ్య పర్యటనలకు వెళ్తున్న ముఖ్యమంత్రి... నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలను కూడా తీసివేయించడం దారుణమని అన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ఆయన ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయమని అడిగారు. ఇదంతా పోలీసు భద్రత కాదని... జగన్ రెడ్డి అభద్రత అని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News