sex: వృద్ధాప్యంలో శృంగారం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్న అధ్యయనాలు!

Surprising health benefits of having sex for 50 year olds and more
  • ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు
  • హార్ట్ ఎటాక్ రిస్క్ సగం తగ్గుతుంది
  • శారీరక నొప్పుల నుంచి ఉపశమనం
  • జీవిత కాలం పెరుగుదల
  • అధ్యయన పూర్వకంగా వెల్లడించిన పరిశోధకులు
శృంగారం కేవలం సృష్టి కార్యమే కాదు. మంచి వ్యాయామం కూడా. వ్యాయామాలతో శారీరకంగా బలోపేతం అవుతాం. ప్రాణాయామం, ధ్యానం మనసును బలోపేతం చేస్తాయి. కానీ ఏకకాలంలో మనసును, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రకృతి కార్యం శృంగారమేనని నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్లు దాటిన వారు సైతం ఇందులో పాల్గొనడం వల్ల ఎన్నో విధాల ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

వృద్ధాప్యంలో శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనివల్ల మానసిక, భావోద్వేగాల పరమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. ఆత్మగౌరవం కూడా ఇనుమడిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. 

నెలలో ఒక్కసారి శృంగారంలో పాల్గొనే పురుషులతో పోలిస్తే.. వారంలో కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనే పురుషులకు హార్ట్ ఎటాక్ మరణాల ముప్పు 50 శాతం తగ్గుతోంది. ఇక శృంగార జీవితాన్ని ఆస్వాదించే 50 ఏళ్లు దాటిన మహిళలకు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ/ప్యాడ్) వచ్చే రిస్క్ తగ్గుతుంది. ప్యాడ్ అంటే ఆర్టరీలు చిన్నవిగా మారడం (కుచించుకుపోవడం). ముఖ్యంగా కాళ్లలో ఇది కనిపిస్తుంది. దీనివల్ల స్ట్రోక్ రిస్క్ ఉంటుంది.

శృంగారం వల్ల డిప్రెషన్ తగ్గిపోతుంది. ఆందోళన, ఒంటరితనం భావన ఉండవు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల సంతోషం, మంచి భావనలు ఏర్పడతాయి. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ఫలితాలు సైతం, శృంగారం చేయని వారితో పోలిస్తే.. చేసేవారిలో డిప్రెషన్ ఉండదని తేల్చింది.

తలనొప్పి, ఆర్థరైటిస్, ఎలాంటి నొప్పులు అయినా సరే.. శృంగారంతో ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ నొప్పి వచ్చిన వారిలో 60 శాతం మంది తమకు శృంగారంతో ఉపశమనం కలిగినట్టు చెప్పారు. జీవిత కాలం కూడా పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు.
sex
health benefits
new study
old people

More Telugu News