Areez Pirojshaw Khambatta: రస్నా డ్రింక్ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా ఇక లేరు!
- 85 ఏళ్ల వయసులో అరీజ్ మృతి
- ప్రపంచ పార్సీ ఇరానీ జొరాస్టిస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించిన అరీజ్
- 60 దేశాలకు ఎగుమతి అవుతున్న రస్నా
సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన 'రస్నా' వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. శనివారంనాడు ఆయన కన్నుమూశారని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. 'ఐ లవ్ యూ రస్నా' ప్రకటన ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ దాదాపు 60 దేశాలకు ఎగుమతి అవుతోంది. కూల్ డ్రింక్ ధరలు పెరుగుతున్న సమయంలో మార్కెట్లోకి రస్నా అడుగుపెట్టింది. కేవలం రూ. 5 ప్యాకెట్ తో 32 గ్లాసుల డ్రింక్ ను తయారుచేసుకునేలా ఈ ప్రాడక్ట్ ను అప్పట్లో అరీజ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. బెనోవోలెంట్ ట్రస్ట్ ఛైర్మన్ గా, ప్రపంచ పార్సీ ఇరానీ జొరాస్ట్రియన్స్ ఛైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు.