Telangana: ఇంటర్​ ఫస్టియర్​ అడ్మిషన్లకు చివరి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

TSBIE extends last date for admissions into first year intermediate courses
  • అడ్మిషన్లకు అవకాశం కల్పించిన ఇంటర్ బోర్డు
  • నేటి నుంచి 27 వరకూ అవకాశం
  • వెబ్ సైట్లో విద్యార్థుల వివరాల నమోదుకు ఇదే తుది గడువు 
ఇంటర్మీడియెట్ తొలి ఏడాది అడ్మిషన్లకు తెలంగాణ ఇంటర్ బోర్డు చివరి అవకాశం కల్పించింది. ఈనెల 21 నుంచి 27 వరకూ వెబ్ సైట్ ద్వారా అడ్మిషన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటిదాకా అడ్మిషన్ పొందని విద్యార్థులు ఇంటర్ లో చేరవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 

వాస్తవానికి గత నెల 15వ తేదీతోనే ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్ల గడువు ముగిసింది. కానీ, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల వివరాలను ఇంటర్ వెబ్ సైడ్ లో నమోదు చేయలేదు. దాంతో, అడ్మిషన్ల నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే, అడ్మిషన్లకు ఇదే తుది గడువు అని స్పష్టం చేసింది.
Telangana
inter
first
year
admissions
last date

More Telugu News